2023-24 రాష్ట్ర బడ్జెట్ రూ.2,89,672 కోట్లతో రూపొందించారు. ఇందులో రాష్ట్ర పన్నులు రూ.1,31, 028 కోట్లుగా చూపారు. ఇదే బడ్జెట్లో ఎక్సైజ్ (మద్యం) ఆదాయం అడ్డా పన్ను రూ.19,885 కోట్లు కాగా, మద్యం అమ్మకాలపై రూ.8,000 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ప్రకటించారు. ఏటా ప్రభుత్వం రూ.4000 కోట్ల మద్యం అమ్మకాలు చేస్తున్నది. ఇదికాక విదేశీ మద్యాన్ని కూడా దిగుమతి చేసుకుంటున్నది. రాష్ట్రంలో 17 బేవరీస్ కార్పొరేషన్స్, 6 ఫారిన్ లిక్కర్ కార్పొ రేషన్స్ అమ్మకాలు సాగిస్తున్నాయి. మద్యం రీటైల్ అమ్మకాల లైసెన్సులకు దరఖాస్తులు తీసుకొని వాటిలో నుండి లక్కీడ్రా ద్వారా వచ్చిన వారికి లైసెన్సులిస్తారు. 2023 సంవ త్సరం లైసెన్సుల కోసం 11,31,954 దరఖా స్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. వీటి ద్వారా రూ.2,639 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. లక్కీడ్రా ద్వారా 2,620 రిటైల్ షాపులను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన షాపులు అడ్డా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల జనాభాలోపు షాపుకు యేటా రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేల లోపు జనాభాకు రూ.55 లక్షలు, 50 వేల నుండి లక్ష జనాభాకు 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభాకు రూ. 65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ. 85 లక్షలు, 20 లక్షల పైన షాపుకు కోటి పది లక్షలు అడ్డా పన్ను చెల్లించాలి. తర్వాత ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన మద్యంకు, మద్యం ధరతో పాటు అమ్మకం పన్ను కూడా చెల్లించాలి. ఈ మధ్య ప్రభుత్వం మద్యం ధరలను 30 శాతం పెంచింది. తద్వారా ఆదాయం పెంచుకుంది.
2620 షాపులలో 786 షాపులకు రిజర్వేషన్ ప్రకటిం చారు. 15 శాతం గీత కార్మికులకు, 10 శాతం దళితులకు, 5 శాతం గిరిజనులకు కేటాయించారు. రిటైల్ షాపులకు లైసెన్స్ పొందిన వ్యక్తి తన ఏరియాలో బెల్టు షాపులు పెట్టే అవకాశం ఉన్నది. తద్వారా ప్రతి ఇంటికి మద్యాన్ని అందించే ఏర్పాటు చేయడం వల్ల పేదలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మద్యానికి వ్యయం చేస్తున్నారు. వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. విద్య, వైద్యం కన్నా మద్యం పై ప్రజలు ఎక్కువ మమకారం చూపుతున్నారు. ఎక్సైజ్ డిపార్టుమెంట్ లైసెన్సులోని చట్టాలను అమలు చేయకుండా విచ్చలవిడిగా బెల్టు షాపులకు అవకాశం కల్పించి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నది. మద్యం అమ్మకాలు ప్రతి ఏటా పెరుగుతూ ప్రస్తుతం రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. మద్యం అమ్మ కాలు పెరుగడంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది. 2020లో ఆర్థిక నేరాలు 12,985 జరుగగా, 2021లో 20,759కి పెరిగింది. ఒక్క హైదరా బాద్‌లోనే 2022లో 22,060 కేసులు పెరిగినట్టు నేర రికార్డులు చెప్తున్నాయి. ఆర్థిక నేరాలే కాక సాంఘిక నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం అమ్మకా లను పెంచుకోవడానికి దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాల ఇండ్ల వద్ద ఎక్కువ బెల్టు షాపులు పెడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, హాస్పి టల్స్, దేవాలయాలు, కార్యాలయాలు, కిరాణా దుకాణాలలో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వీరు పెట్టే బెల్టు షాపులకు ఎలాంటి లైసెన్సులు ఉండవు. కానీ, ఎక్సైజ్ శాఖ వీలైనంత మద్యం అమ్మకాలు పెంచడానికి బెల్టు షాపులను ప్రోత్సహిస్తుండటం విచారకరం.
మొత్తం బడ్జెట్‌లోని రాష్ట్ర పన్నుల ఆదాయంలో 30 శాతం మద్యం పైనే వస్తున్నది. దీనికితోడు ప్రజలపై భారాలు వేయడానికి భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచారు. 2020-21లో రూ. 5,243,28 కోట్ల ఆదాయం ఉండగా, 2023-24 బడ్జెట్లో రూ.18,500 కోట్లకు పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడమే కాక ఆస్తుల విలువను పెంచడం ద్వారా పేదలపై భారం పడుతున్నది. పేదలు స్థిరాస్తులను వారసుల పేరుమీద మార్చినప్పటికీ గతంలో లేని విధంగా రిజిస్ట్రే షన్ ఛార్జీలను నిర్ణయించారు. మహిళలకు ఇచ్చే ”స్త్రీ ధనం” పై కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న రిజిస్ట్రేషన్ ఆదాయంలో 50 శాతం పైగా పేద ప్రజల నుండే వస్తున్నది. రూ.1.31 లక్షల కోట్ల రాష్ట్ర పన్నుల్లో రూ.55 కోట్ల పన్నులు మద్యం, రిజిస్ట్రేషన్ ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. ఈ ఆదాయాన్ని ప్రభుత్వం ఉత్పత్తి రంగం కాకుండా, అనుత్పాదక రంగం పై వ్యయం చేయడం ద్వారా సాంఘీకంగా తెలం గాణ అభివద్ధి కావడం లేదు. 2014లో ఉన్న అక్షరాస్యత 64 శాతం కొద్దిగా పెరిగి 65 శాతం వద్ద నిలిచిపోయింది. అక్షరాస్యత అనగా 10వ తరగతి ఉత్తీర్ణుడైతేనే అతన్ని గుర్తించాలి. కానీ, పాఠశాలలో పేరు నమోదు చేసు కుంటే గుర్తిం చడం అక్షరాస్యత కాదు. ఇప్పటికీ బాల కార్మి కులు 6-14 సంవత్సరాల మధ్య వయస్సు కలి గిన వారున్నారు. హైదరాబాద్ పట్టణంలోనే ప్రమాదకర పనుల్లో 25 వేల మంది పిల్లలు పనిచేస్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి.
మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయ రాబడి చూస్తున్నదే తప్ప పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, ఆవాసం గురించి పట్టిం చుకోవడం లేదు. ఒకవైపున తలసరి వార్షికాదాయం రూ.3 లక్షలకు పైగా పెరిగిందని, దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నా మని చెబుతూనే, మరోవైపున ఇండ్లు లేనివారు మద్యానికి బానిసై ఆస్తులు కోల్పోతున్నవారు, శారీరక ఆరోగ్యం దెబ్బతిని అర్ధాంతరంగా మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. మద్యం వల్ల బుద్ధిమాంద్యం పెరిగి చైతన్యం కోల్పోతున్నారు. ప్రతిరోజూ మద్యం దుకాణాల ముందు వందల సంఖ్యలో లైన్ కడుతు న్నారు. వీరి ఒత్తిడికి తట్టుకోలేక దుకాణాలకు ఇనుప గ్రిల్స్ పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. మారుతున్న కాలా నికి అనుగుణంగా ప్రజలను చైతన్య పర్చాల్సిన ప్రభుత్వం బుద్ధి మాంద్యం గల సమాజాన్ని తయారు చేస్తున్నది. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్లను పరిశీలిస్తే 5,73,050 మంది భర్తను కోల్పోయినవారు, 1,43,456 మంది ఒంటరి మహిళ లున్నట్లు తెలుస్తు న్నది. పెన్షన్లు పొందకుండా ఉన్న వారి సంఖ్య సర్వే చేస్తే ఇంతకన్నా రెట్టింపు అవు తుంది. తొమ్మిదేండ్ల పాలనలో కనీసం అక్షరాస్యత 94 శాతానికి పెరగాలి. వయోజన విద్య పాఠశాలలు ఏర్పాటు చేస్తే పాఠశాలకు వెళ్ళనివారికి కూడా విద్య గరపాలి. అలాగే ప్రస్తుతమున్న ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లతోపాటు మందులను అందుబాటులో పెట్టాలి. ఖర్చు భరించలేనప్పటికీ ప్రభుత్వ హాస్పిటళ్ళకన్నా ప్రజలు ప్రయివేటు హాస్పిటళ్లకే వెళుతున్నారు. ప్రాణాలు రక్షించుకోవడం ముఖ్యంగా భావిస్తున్నారు. మురికి వాడలను బాగు చేయడానికి ఏటా పథకాలను ప్రక టించటమే తప్ప, అమలు చేయడం లేదు. కానీ, మురికివాడ లలో మద్యం బెల్టు షాపులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. వారికొచ్చే ఆదాయంలో 75 శాతం మద్యం దుకాణాలకే వెళ్లి పోతాయి. మద్యం వల్ల కుటుంబంలో తగాదాలేర్పడి, కుటుంబ విచ్ఛిన్నం జరుగుతున్నది. అయినా ప్రభుత్వం తన పథకాల ద్వారా రాష్ట్రం అభివద్ధిలోకి వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర సమగ్ర సర్వేలో ఆస్తులు కోల్పోతున్నవారు, అనారోగ్యానికి గురౌతున్న వారి వివరాలు కూడా సేకరించారు. కానీ, వాటిని సరి చేయడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మద్య నిషేధం చేయాలని నెల్లూరు జిల్లా, దూబగుంటలో రోషమ్మ నాయకత్వాన పెద్ద పోరాటం జరిగింది. రాష్ట్రంలోని మహిళలందరూ పాల్గొన్నారు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి మద్యనిషేదాన్ని అమలు చేసింది. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్య నిషేదాన్ని అమలు చేస్త్తే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మద్య నిషేదాన్ని సడలిం చింది. నేటి ప్రభుత్వం మద్యంపైనే 30 శాతం బడ్జెట్ ఆదా యాన్ని రాబడుతున్నది. దీనిని గొప్పగా చెప్పుకుంటున్నది. ప్రయి వేటు మద్యాన్ని, గుడుంబాను నియంత్రించామని, ఆరోగ్యకర మైన మద్యాన్ని అందిస్తున్నామని ప్రచారం చేయడం విడ్డూ రంగా ఉన్నది. ప్రపంచంలో గానీ, దేశంలో గానీ ఇంత ప్రోత్సా హకరంగా మద్యాన్ని విక్రయిస్తున్న ప్రభుత్వం మరొకటి లేదు. ఇది ప్రభుత్వ ఆదాయానికి ఒక మార్గంగా ఉపయోగించు కుంటున్నది. ఇప్పటికైనా ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితులను, మెరుగుపర్చడానికి మద్యంపై నియంత్రణ పెట్టాలి. ప్రభుత్వం బడ్జెట్ పెంపునకు ఆస్థి పన్నును పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలి. అప్పుడే ప్రజల బతుకులు కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది.
మల్లు లక్ష్మి
9848481099