నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని క్వీన్స్ జిమ్ తరపున కోచ్ రచన రాఘవ గారి సారథ్యంలో శిక్షణ పొందినటువంటి పుల్లూరి అలేఖ్య కృష్ణ శనివారం డబ్ల్యూ పిసి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో బహుమతులు పొందినారు. మహిళ విభాగంలో బెంజ్ ప్రెస్ ,డేడ్ లిఫ్ట్ లో 35 kg,100kg ఎత్తి రెండు గోల్డ్ మెడల్స్. డబ్ల్యూ పిసి స్టేట్ ప్రెసిడెంట్ మిస్సెస్. రేఖ గారి చేతులమీదుగా తీసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు క్వీన్స్ జిమ్ వ్యవస్థాపకులు రచన రాఘవ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.