నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఆలేరు నియోజకవర్గంను కరువు రహిత ప్రాంతంగా తీర్చి దిద్ది, తెలంగాణకు ధాన్య భాండాగారంగా చేయడమే తన సంకల్పమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం మైలర్ గూడెం గ్రామ చెరువు నిండి అలుగు పారుతుండటం తో బీర్ల ఐలయ్య గ్రామస్థులు, రైతులతో కలసి పసుపు కుంకుమ వేసి, హారతి ఇచ్చి, పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల ఉపాధ్యక్షులు బండి అశోక్, గ్రామస్తులతో కలిసి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. కొద్దిరోజులుగా జలయజ్ఞం లో భాగంగా ఆలేరు నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల్లో ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. సాగునీరు త్రాగునీరుతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా మదర్ డైరీ డైరెక్టర్ పుప్పాల నరసింహులు, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కాదురి భానుచందర్, బరిగే రామచందర్, ఆకుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.