మెడికో హెల్త్‌కేర్‌ సంస్థకు అల్ఫోర్స్‌ విద్యార్థులు ఎంపిక

నవతెలంగాణ – కరీంనగర్‌ : తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌, నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో మెడికో హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌, టెక్నాలజీస్‌ సంస్థకు తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని కళాశాల కరస్పాండెంట్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఉత్తమ శిక్షణ, చక్కని ప్రణాళిక, పటిష్ట కార్యాచరణ ద్వారా విద్యార్థులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అనేక పోటీ పరీక్షలతో పాటు ప్రాంగణ నియామకాలలో సులువుగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులను టాస్క్‌ జిల్లా పౌర సంబంధాల మేనేజర్‌ గంగా ప్రసాద్‌, కంపెనీ ప్రతినిధి అభిలాష్‌ బృందం, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, టీపీఓ డాక్టర్‌ విజయలకిë, అధ్యాపకులు అభినందించారు.