– భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా శోభ రాణి నియామకం
నవతెలంగాణ -రామన్నపేట
కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులన్నీ మంచి రోజులేనని, రాష్ట్ర, దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరాభిమానాలు పెరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మునిపంపుల గ్రామానికి చెందిన గాదె శోభారాణి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ చెక్కుచెదరలేదని నిక్కారసైన నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్నారని ఆయన అన్నారు. గాదే శోభారాణమాట్లాడుతూ మండలంలోని మహిళలను కలుసుకొని కాంగ్రెస్ బలోపేతానికి కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి పున్న రమేష్, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మేడి రవి చంద్ర, నాయకులు నల్లా వెంకట్ రెడ్డి, దొమ్మాటి లింగా రెడ్డి, గాదె కష్ణ, ఐటీపాముల పెద్దులు, పున్న వెంకటేష్, తాటిపాముల సాయి, అవనగంటి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.