
నవతెలంగాణ – మద్నూర్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల తహసిల్దార్ కార్యాలయం లో శుక్రవారం నాడు నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ బి ఎల్ ఓ లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మ్ – 12 డి ద్వారా పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులు, వయోవృద్దులు85 సం” పై బడిన వారు తమ ఓటు హక్కును ఇంటి దగ్గరే వినియోగించుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు. బి ఎల్ ఓ లు ప్రతి గ్రామంలో వికలాంగులు, వయోవృద్దులకు85 సం” పై బడిన వారు ఓటు హక్కును ఇంటి దగ్గరే వినియోగించుకునే విధంగా వారిని జాగ్రత్త గా గుర్తించాలని సూచించారు. ఎన్నికల కమీషన్ హోం ఓటింగ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించే కార్యక్రమం ప్రారంభిస్తాం అని తెలిపారు.ఈ సమావేశంలో మద్నూర్ మండల తహసిల్దార్ ఎం.డీ ముజీబ్, డి. టి భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్దావార్ శంకర్ బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.