ఆరు గ్యారంటీలతో అందరికి భరోసా..

-మండలంలో జోరుగా కాంగ్రెస్ శ్రేణుల ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-బెజ్జంకి: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాష్ట్ర ప్రజలందరికి భరోసాను కలిగిస్తాయని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీమా వ్యక్తం చేశారు.బుధవారం మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులు మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు ఓటేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించి అభ్యర్థించారు.మండల,అయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.