– వైద్య అధికారి డాక్టర్ రాధకిషన్.
నవతెలంగాణ – తొగుట
5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైద్య అధికారి డాక్టర్ రాధకిషన్ కోరారు. శనివారం విలేకరులతో మాట్లా డుతూ నేడు పోలియో ఆదివారం 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించా లని సూచించారు. మండలంలోని 5 సంవత్సరాల లోపు వయసు గల సుమారు 2556 మంది చిన్నా రులకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించి వారిని అంగవైకల్యం నుంచి కాపాడాలని అన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో మన భారతదేశాన్ని పోలియో రహిత భారతదేశం గా మార్చేందుకు ప్రతి ఒక్క ఒక్కరు కృషి చేయాల న్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. పోలియో చుక్కలు వేయడానికి ప్రతి గ్రామంలో పోలియో బూత్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండ ల వ్యాప్తంగా 28 బూత్ లు, ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. 4, 5 తారీఖులలో గృహ సందర్శన చేస్తూ మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారని అన్నారు.