
నవతెలంగాణ-రామగిరి
ప్రభుత్వ కుల గణన సర్వేకు అందరూ సహకరించలని మంథని డీఎల్పీఓ కొమ్మెర సతీష్ అన్నారు. రామగిరి మండలంలోని నవాబ్ పేట, బేగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ప్రతిరోజు సర్వేలో 15 ఇండ్లకు తగ్గకుండా సర్వే జరగాలని ఆదేశించారు. సర్వేపై తగు సూచనలు ఎనిమినేటర్లకు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు పెంచాల.రత్నాకర్, అంకతి సందీప్ పాల్గొన్నారు. అదేవిధంగా 15 గ్రామపంచాయతీలో సర్వే వేగవంతంగా జరుగుతుంది.
ప్రభుత్వము కుల గణన, ఆర్థిక, రాజకీయ ఇతర అంశాలపై సర్వే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రామగిరి మండలంలో 17 గ్రామాలలో సర్వేను 102 మంది ఏనుమ్యూరేటర్లు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపీడీఓ బద్రి శైలాజ రాణి, ఎంపీఓ దేవరకొండ ఉమేష్,ఐసీడీఎస్ సూపర వైజర్ లు పల్లె అనిత, పర్కల.శారదా, డిప్యూటీ తహసీల్దార్ రుద్రంబట్ల మానస, మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్, ఆర్ఐ లు కె మహేష్,రెవెళ్లి నిహారిక, ఐకేపీ ఏపీఎం గొట్టే స్వరూప రాణి, గ్రిడ్ ఏఈ వాసవి, ఉపాధి ఈసీ రాసపల్లి లక్ష్మన్ లు ఆయా గ్రామాలలో సర్వే పనులను పరిశీలిస్తున్నారు.