– మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి డిమాండ్
– ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యో తి డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధనకై తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ కార్యాల యం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్ర య్య అధ్యక్షతన మాహా ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు ముఖ్య అతిథులుగా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మాట్లాడుతూ… దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా పేదవాడికి సొంత ఇల్లు లేకపోవడం పేద ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఉండడానికి ఇల్లు లేక చేసుకోవడా నికి చేతినిండా పనులు దొరక అయోమయం లో ఉంటూ అనేక అవమానాలు భరిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యువజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రా ష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేద న్నారు. ఇల్లు లేని పేదలకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.మల్లేష్, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద ప్రజ లందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో అటవీ భూములలో సాగులో ఉన్న గిరిజనులకు గిరిజనేతరు లకు మొత్తం 9,647 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 430 మందికి ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. మిగి లిన 9,211 మంది లబ్దిదారులను రిజెక్ట్ చేశారో, కనీసం రాతపూర్వకంగా వారికి మెమో లు ఇచ్చారో లేదో క్లారిటీ లేదని, సాగులో ఉన్న వారికి ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక జిల్లా అధ్యక్షులు యూ, బుగ్గప్ప, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, వెంకట్ రాము లు, రైతు సంఘం జిల్లా నాయకులు సుదర్శన్, ఎన్పీఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్, ఎస్‌ఎ ఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సతీష్, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి, అనంతమ్మ, జిల్లా నాయకు లు ఎండి హబీబ్, సత్తయ్య, లాలయ్య, గోపాల్, రఘురాం శేఖర్, చంద్రయ్య పాల్గొన్నారు.