
ప్రతి ఉపాధి హమీ పథకంలో కూలీ పనులు చేస్తున్న వారికి ఎండల నుండి కాపాడుకోవాడానికి వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని పడంపల్లి గ్రామ ఎఫ్ఏ సూర్యకాంత్, ఆశా వర్కర్ భాగ్యశ్రీ అన్నారు. గురువారం నాడు గ్రామములోని పొలిమెరలలో కూలీ పనులు చేస్తున్న పని ప్రదేశంలో ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి ఎండ నుండి తమకు తాము ఎలా కాపాడుకోవాలో, డీహైడ్రేషన్ కు గురైనవారికి ఎలా ప్రథమ చికుత్స చేయాలో అవగాహన పర్చడం జర్గింది. అనంతరం కూలీలందరికి వైద్యఆరోగ్యశాఖ సరఫారా చేసిన ఓఆర్ఎస్ ప్యాకేట్లను పంపిణి చేసి ఎలా వాడాలో ఏఫ్ఏ, ఆశావర్కర్ కూలీలకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఏ సూర్యకాంత్, ఆశా వర్కర్ భాగ్యశ్రీ, ఉపాదీ కూలీలు తదితరులు పాల్గోన్నారు.