
నవతెలంగాణ-మల్హర్ రావు : అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్ లో వున్న భూపాలపల్లి,మంచిర్యాల,పెద్దపల్ లి,అసిపాబాద్,కొంరంబిం తదితర ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడుగా తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ లను ఏకగ్రీవంగా నియామకం చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్తి కమిటీతోపాటు పెద్దపల్లి జిల్లా కమిటీలను బుధవారం అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక,రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ ప్రకటించారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బొంకూరి రమేష్,కాళేశ్వరం జోనల్ కార్యదర్శిగా రాజేశం,ప్రచార కార్యదర్శిగా భద్రయ్య, కాళేశ్వరం జోన్ మహిళ అధ్యక్షురాలుగా మంచినీళ్ల సారక్క, ఉపాధ్యక్షురాలుగా లక్ష్మీ, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడుగా చీకటి సత్య కీర్తన, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడుగా నల్లిగంటి శ్యాం కుమార్ ఎన్నికయ్యారు.తమపై నమ్మకంతో ఈ పదవులు అప్పజెప్పిన జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి,రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బచ్చలి రాజయ్య, రాజేశం,వెంకటేశం పాల్గొన్నారు.