ఇంజనీర్లు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య  మార్గంలో నడవాలి  

– ఆర్జీ-3 జిఎం ఎన్ సుధాకర్ రావు 
నవతెలంగాణ-రామగిరి
ప్రముఖ సివిల్ ఇంజనీర్, భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య  జయంతి సందర్భంగా రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జిఎం కార్యాలయములో శుక్ర వారం  ‘ఇంజనీర్స్ డే’ జరిపారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి జి ఎం ఎం సుధాకర్ రావు పూలమాలవేసి  నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య  దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి నిరాడంబరత, భారత జాతి అభివృద్ధికి చూపిన అంకిత భావం వలన వారికి భారతరత్న బిరుదు లభించిందన్నారు. అలాగే మన రాష్ట్రంలో మూసి నది వరదల నివారణ ఆయన పనితనమేనని, ఆటోమేటిక్ వరద గేట్ ల వ్యవస్థతో పాటు అనేక సివిల్ ఇంజనీర్ పనులే గాక ఆర్దిక పరమైన ఉత్తమ సలహాలను జాతి అభివృద్ధి కై అందించారని అన్నారు. గ్రామాలలో సైతం విశ్వేశ్వరయ్య విగ్రహాలు అనేక ఆవిష్కరణలు జరుగుతున్నాయనీ, వారంతా ఇంజనీర్లేననీ,  అభివృద్ధికి మన వంతు పాత్ర నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏరియా ఇంజినీర్ లు పి ఎలీషా, సీతరామం, ఎస్ఓటూ జీఎం లు డి బైద్య, జి రఘు పతి,ఫైనాన్స్ ఎజిఎం పి శ్రీనివాసులు, ఏరియా సేఫ్టీ అధికారి సిహెచ్ వెంకట రమణ, ఐఈడి, డిజిఎం కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి,ప్రాజెక్టు ఇంజినీర్  ఎం. నాగరాజు, సీనియర్ సెక్యూరిటి అధికారి ఈ.లక్మి నారాయణ తదితరులు  పాల్గొన్నారు.