– తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్
అన్ని సామాజిక వర్గాలు, అన్ని కార్య వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉం డాలని నిర్ణ యించుకో వడం గొప్ప విషయమని తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలో కేబుల్ ఆపరేటర్లు, రియల్ వ్యాపారులు వేరువేరుగా సమావేశాలు నిర్వహించి ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవ తీర్మాన పత్రాలు అందించినట్లు ఆయన తెలిపారు. లక్ష మెజార్టీతో ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసినట్లు ఆయన చెప్పారు. తొమ్మిది సంవత్సరాలుగా నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడమే కాకుండా వారికి కావలసిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అందించినట్లు ఆయన గుర్తు చేశారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ముందు వచ్చి వెళ్లిపోయే పార్టీలని ఆయన అన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రజల బాధలు పట్టించుకునేందుకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కేబుల్ ఆపరేటర్ వారికున్న సమస్యలను ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణ పరిష్కారం చేస్తుందన్నారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రం వస్తుందని ఆ తర్వాత పంట ఎండిపోయి రైతులు దిగులు చెందుతారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ 24 గంటల విద్యుత్ అందిస్తుందని ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్, రియల్ వ్యాపారుల అసోసియేషన్ ఏకగ్రీవ పత్రాలను ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అందించారు.