రుణమాఫీని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి

All farmers should take advantage of the loan waiver– కాన్గల్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీని రైతు లందరూ సద్వినియోగం చేసుకోవాలని కాన్గల్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రైతుల కు లక్ష రూపాయల రుణమాఫీ నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంద రూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రుణ మాఫీ అయిన రైతులందరూ సంబంధిత డాక్యు మెంట్లను సొసైటీ అధికారలకు అందజేసి రుణాలను పొందాలని అన్నారు. సొసైటీ పరిధిలో 167 మంది రైతులకు, రూ. 55 లక్షల 83,097  సొసైటీకి రుణమాఫీ వచ్చిందని చెప్పారు. డాక్యు మెంట్లు అందచేసిన రెండు, మూడు రోజులలో రైతులకు తిరిగి రుణాలను తమ ఖాతాలలో జమ చేయ నున్నట్లు తెలిపారు. అలాగే సొసైటీలో యూరియా, గ్రోమోర్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.