మనుషులంతా ఒక్కటే అందరూ సమానులే

– గ్రామంలో సంఘటన దురదష్టకరం
– మూఢనమ్మకాలు నమ్మొద్దు, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– కనువిప్పు కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి
నవతెలంగాణ-సిద్ధిపేటరూరల్‌
మనుషులంతా ఒక్కటే అందరూ సమానులేనని ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని సిద్దిపేట రూరల్‌ సిఐ శ్రీను, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి అన్నారు. పోలీస్‌ కమిషనర్‌ అనురాధ ఆదేశాల మేరకు బుధవారం సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో పోలీసు కళాబందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో జరిగిన సంఘటన దురదష్టకరం మనుషులంతా ఒక్కటే అందరూ కలిసిమెలిసి ఉండి గ్రామాభివద్ధికి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. కులాలు మతాల పేరుతో మనుషులను విభజించవద్దని రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం స్వేచ్ఛగా జీవించాలని తెలిపారు. కులాలు మతాల పేరుతో గ్రామాలలో వివక్ష చూపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కలసి మనిషిని మనిషిగా గౌరవించి ఎలాంటి తారతమ్యాలకు తావివ్వకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొనేటప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దష్టికి వస్తే వెంటనే డయల్‌ 100, లేదా సిద్దిపేట పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 8712667100 సమాచారం అందించాలని సూచించారు. అందించిన వారి పేర్లు గోప్యం ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.