ఆల్ ఇండియా క్రికెట్ విజేత మన్యవారి పల్లి జట్టు 

Manyavari Palli team is the winner of All India Cricket– మొదటి బహుమతి రూ.5 లక్షలు
– రెండవ బహుమతి రూ.3 లక్షలు 

– మూడవ బహుమతి రూ.1,50,000 అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ 
నవతెలంగాణ – అచ్చంపేట 
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గత వారం రోజులుగా ఆల్ ఇండియా క్రికెట్ పోటీలు సి వి కె క్రికెట్ కప్ అధ్యక్షులు చంద్రమోహన్,  కార్యదర్శి కటకం రఘు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. శనివారం ఫైనల్ పోటీలు జరిగాయి కర్ణాటక కు చెందిన బళ్లారి క్రికెట్ జట్టు, అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి క్రికెట్ జట్టు పోటీపడ్డాయి. మొదటగా బళ్లారి క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 10 వికెట్ల నష్టానికి   186 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్  చేసిన మన్నె వారి పల్లి క్రికెట్ జట్టు 187 పరుగులు చేసి విజయం సాధించారు. క్రికెట్ పోటీలు చూడడానికి వివిధ జిల్లాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్రీడాకారులతో అభిమానులతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. క్రికెట్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, పరిశీలించారు. అనుష కన్స్ట్రక్షన్ అధినేత జలంధర్ రెడ్డి వారి సౌజన్యంతో  విజేతలైన జట్టులకు బహుమతులు ప్రధానం చేశారు. స్నేహపూర్వక వాతావరణం లో ఆల్ ఇండియా క్రికెట్ పోటీలను విజయవంతం చేసినందుకు క్రీడాకారులను అభిమానులను ఎమ్మెల్యే అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ప్రతి ఒక్కరు ఆటలు ఆడడం అలవాటు చేసుకోవాలన్నారు విజేత జట్టు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించారు.