నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో ఆదివారం అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించబడును అని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రామగిరి మండల యాదవ సంఘం నూతన కమిటీ యూత్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఈ సమావేశానికి యాదవకుల భాంధవులు అందరు సకాలములో అధిక సంఖ్యలో పాల్గొని, సమావేశాన్ని విజయవంతము చేయలనీ ఆయన కోరారు.