జర్నలిస్టులందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి

– పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ విస్మరించింది
– భూపాలపల్లి జిల్లా జాతీయ బిసి సంఘం ఇంచార్జి విజయగిరి సమ్మయ్య 
నవతెలంగాణ – మల్హర్ రావు
వర్కింగ్ జర్నలిస్టులదరికి డబుల్ బెడ్రూం ఇల్లు మెజారు చేయాలని భూపాలపల్లి జిల్లా జాతీయ బీసీ సంఘం ఇంచార్జి విజయగిరి సమ్మయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పదేళ్ల పాలనలో జర్నలిస్టులను విస్మరించిందన్నారు. ప్రజా పాలన చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. అయిన బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. ప్రజా  సమస్యలు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకపోవడంలో వారి పాత్ర కిలకమని, అలాగే  ప్రభుత్వ  పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు, అర్హులైన జర్నలిస్టులకు హెల్త్, అక్రిడేషన్ కార్డులు, ప్రమాద బీమా తదితరవి అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.