నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే అధికారులకు సూచించారు. గురువారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పోస్టర్ ను విడుదల చేశారు. వచ్చే అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలలో వయోవృద్ధుల రక్షణ, వారి హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనాధలైన వయోవృద్ధులను గుర్తించి వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి కే నరసింహారావు, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సభ్యులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ బాలేశ్వర్, చంద్రశేఖర్, సోమన్న, రమేష్, జ్ఞానేశ్వర్, బిక్షపతి, సిడిపిఓలు శ్రీమతి శైలజ, జ్యోత్న్స, స్వరాజ్యం, రమ, సమీరా మీర్జా, మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.