– లక్ష మెజార్టీతో ప్రకాష్‌గౌడ్‌ను గెలిపించాలి
– హోం మంత్రి మహమ్మద్ అలీ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైనార్టీలంతా బీఆర్‌ఎస్ పార్టీ వైపే ఉన్నారని, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని హౌం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సులేమా న్‌నగర్ డివిజన్‌లో మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి మహమ్మద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మై నార్టీల కోసం షాదీ ముబారక్ పథకం ఎంతో మంది పేద ముస్లింలకు ఒక వరంల మారిందని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మైనారి టీలకు ఎల్లప్పుడూ అండగా అన్నారు. అందుకే ఆయనను వరుసగా మూడుసార్లు గెలి పించారని నాలుగో సారి గెలిపించడానికి మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు రుణాలు అందజేసి స్వయం ఉపాధి కల్పన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైనార్టీ బస్తీలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సమస్యల ను పరిష్కరించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకాన్ని నియోజకవర్గం లో ప్రతీ ఒక్క లబ్దిదారునికి అందజేశామని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని మరోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ముఖిచాంద్, మొహమ్మద్ గౌస్, నయన్, తదితరులు పాల్గొన్నారు.