మొత్తం మోడీ మహత్య కీర్తనలేనా?

మొత్తం మోడీ మహత్య కీర్తనలేనా?‘జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది నిజమే కానీ ఆ రోజుతో చరిత్ర ఆగి పోదు’ అని సీనియర్‌ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తా వ్యాఖ్యా నించాడు. ఇది వాస్తవం. రాజకీయాల్లో ఒక పరిణా మం తీవ్రతను గుర్తించడం వేరు, అంతటితో అయిపో యిందనీ, అదే అన్నిటినీ నిర్ణయిస్తుందని అనుకోవడం పొరబాటు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు బడామీడియా రోజురోజుకూ అలాంటి కబు ర్లే కుమ్మరిస్తుంటుంది. కొత్త కొత్త పదజా లాలతో పక్కదోవ పట్టిస్తుంటుంది. అంత ర్జాతీయస్థాయిలో గ్లోబల్‌ మీడియా ఏవి ధంగా అన్ని విషయాలూ సామ్రాజ్యవాద కోణంలో ఇస్తుందో, దేశంలో బడామీడి యా కూడా ప్రతిదీ మోడీ మహత్తర విజ యంగా అభివర్ణిస్తుంటుంది. (అదే రాష్ట్రాల లో అయితే వారి వారి ఎంపికల ప్రకారం చేస్తుంటుంది గానీ ఆ ముచ్చట మరోసారి) మూడు రాష్ట్రాలలో బీజేపీకి మెజార్టి రావడంతో హ్యాట్రిక్‌ ఖాయమని తేల్చేసింది.ఇందాక చెప్పుకున్న రామమం దిరం ప్రాణప్రతిష్టతో తిరుగులేదని చెప్పింది. ఆ పిమ్మట బీహార్‌లో నితీష్‌కుమార్‌ సరికొత్త ఊసరవెల్లి వేషాలతో ఇండియా వేదిక పని అయిపోయిందని నిర్ణ యించింది. అదే సమయంలో బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేది లేదని చెప్పడంతో మీడియా మరింత రెచ్చిపోయింది. ఇందులో ప్రతి అంశాన్ని ఒక్క వైపునుంచే చూపిస్తూ అంతా మోడీకి అనుకూల దిశలోనే జరిగిపోతున్నట్టు చిత్రించడానికి నానాపాట్లు పడుతున్నది. అందుకు తగినట్టే స్వతంత్ర ఆర్నాబ్‌లు, లోకల్‌ అర్నాబ్‌ల వంటి స్టార్‌ వ్యాఖ్యా తలు మోడీ అద్భుత జనరంజక శక్తికి కీర్తనల జోరు పెంచుతున్నారు.ఈ ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల ఫలి తాల వరకూ ఆగేది కాదు. తర్వాతి ఘట్టం ప్రజల తీర్పుపై ఆధారపడి వుంటుంది.
నితీశ్‌ ప్రహసనం నిజాలేమిటి?
బీజేపీ ఎన్నికల విజయాలు, కొంతమంది నేతల ఫిరాయింపులు నిజమే. కానీ నాణేనికి మరోవైపు చూడవలసిన పనిలేదా? ఉదాహరణకు బీహార్‌లో నితీశ్‌కుమార్‌ ఫిరాయింపు కొత్తేమీ కాదు, అనుకోనిదీ కాదు. ఆయన పేరులో మొదటి అక్షరానికి దీర్ఘం లేద ని అందరికీ తెలుసు. కానీ 2019 ఎన్నికల నాటికి ఆ యన బీజేపీతో కలిసే పోటీ చేశారు. అత్యధిక లోక్‌ సభ సీట్లు వాళ్లకే వచ్చాయి. కనుక రాజకీయంగా ఇండియాకు డెబ్బ అనడం సరైందే గానీ ఇప్పుడు కొత్త గా కలిగే నష్టం లేదు. ఆయన అలా చేస్తాడనేది అం దరి దృష్టిలో వున్నదే. అసలు ఇండియా పేరిట హడా వుడి చేస్తున్న సమయంలో కూడా ఎవరూ పెద్దగా విశ్వసించింది లేదు. కాకపోతే దేశంలో పెద్ద రాష్ట్రా లలో ఒకటికి ఉత్తరభారతంలో ప్రభావశీల ప్రదేశంగా బీహార్‌కు ప్రత్యేక స్థానముంది గనక లౌకిక పార్టీలు ఆయన రాకను ప్రోత్సహించాయి. నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2020లో జరిగిన శాసన సభ ఎన్నికలనాటికే నితీశ్‌ బలం గణనీయంగా క్షీణిం చింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడికీ 79, బీజేపీకి 78 రాగా జెడియు కేవలం 45 మాత్రమే తెచ్చుకున్నది. 19 స్థా నాలతో కాంగ్రెస్‌,16 స్థానాలతో వామపక్షాలు ఇంకా బలంగా వున్నాయి. ఇప్పుడు నితీశ్‌ కేవలం బీజేపీ కీలు బొమ్మలానే బతకాల్సి వుంటుంది.ఇండియా తరపున తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోరని తెలిసిన త ర్వాతే ఆయన ప్లేటు ఫిరాయించాలని నిర్ణయిం చుకున్నాడు. మామూలుగా అయితే మీడియా దీన్ని చీల్చి చెండాడాలి. ఆ విధంగా ఊసవరవెల్లి చందం అని రాయడం చెప్పడం జరిగింది గాని ప్రధాన దాడి ఇండియా విచ్చిన్నంపైనే పెట్టారు.2022లో తమను ఈసడించుకుని వెళ్లిన నేత తిరిగివస్తే బీజేపీ ఎలా అక్కున చేర్చుకుని అధికారమిచ్చిందనేది మాత్రం ప్రశ్నించిన పాపాన పోలేదు.
మరోవైపు పరిణామాలు
నిజానికి ఇదే సమయంలో పక్క నున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌కు 11 స్థానాలు కేటాయిస్తు న్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌ మరిన్ని సీట్లు కోరుతున్న మాట నిజమే గాని ఈ మాత్రం సర్దుబాటు చిన్నదేం కాదు. ఆప్‌ నాయ కుడు కేజ్రీవాల్‌ హర్యానాలో తాము ఒంట రిగా పోటీ చేస్తామంటూనే లోక్‌సభలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటా మన్నారు. ఇక రాజకీయంగా మరింత కీల కమైన పశ్చిమబెంగాల్‌ విషయానికొస్తే అ క్కడ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టిఎంసి తో పొత్తు వద్దనే వైఖరి తీసుకుంది సీపీఐ (ఎం). ఇటీవలి కాలంలో షహీద్‌ మినార్‌ మైదాన్‌లో యువత అపూర్వమైన బహిరం గసభ కూడా జరిపింది. ‘ఇండియా’లోని కాంగ్రెస్‌తోనే కానీ సీపీఐ(ఎం)తో తమకు కుదరదని తృణమూల్‌ కూడా ప్రకటించింది. అయితే అంతా అయ్యాక మమత కాంగ్రెస్‌కు కేవలం రెం డంటే రెండు లోక్‌సభ సీట్లే కేటాయిస్తానన్నది. మాల్దా దక్షిణం, బెర్హంపూర్‌ అనే ఆ రెండు ఇప్పటికీ కాంగ్రెస్‌ సభ్యుల చేతుల్లోనే వున్నాయి. కనుక వారు కూడా అంగీకరించలేదు. ఈ సమయంలో రాహుల్‌గాంధీ న్యాయ జోడోయాత్ర వచ్చినపుడు కూడా తృణమూల్‌ వర్గీయుల రాళ్లు విసిరి దౌర్జన్యం చేశారు. మరోవంక సీపీఐ(ఎం) నాయకులు సభలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం)రాజకీయ విధానం మమత మీద పోరాటమేనని స్పష్టంచేశారు. రాహుల్‌ గాంధీ మాత్రం తాము ఇప్పటికీ ఆ పార్టీతో సీట్ల సర్దు బాటు చర్చలు జరుపుతున్నామన్నారు. కేరళలో ఎల్‌డి ఎఫ,్‌ యుడిఎఫ్‌ ఎప్పుడూ వేరువేరుగానే పోటీ పడు తున్నాయి. కనక ఇక్కడ రాజకీయంగానీ, సీట్ల రీత్యా గానీ నష్టపోయింది లేదు. పైగా ఇక్కడ యూపీ మిన హా ఇవేవీ బీజేపీ పాలనలోని రాష్ట్రాలూ కాదు. అందు వల్ల బీహార్‌ పరిణామాలతో ఇండియా అతలాకుతలం అయిపోయినట్టు అంతా తిరగబడినట్టు చెప్పడం దురుద్దేశపూరితం. ఇప్పుడు వారు గెలిచిన మూడు రాష్ట్రాలలో కూడా బీజేపీకి 39 స్థానాలుంటే కాంగ్రెస్‌ కు కేవలం రెండే వున్నాయి, అందువల్ల కొత్తగా ఏమొ చ్చినా లాభమే గాని నష్టపోయేది వుండదు. ఇవన్నీ వాస్తవికమైన ఆధార సహిత విషయాలయినప్పుడు మోడీ ఏదో అపారబలం పుంజుకున్నట్టు మిగిలిన పార్టీలన్నీ భయంతో వణికిపోతున్నట్టు మీడియా చెప్పడం ఎంత దారుణం?
నిజంగా ఏకపక్షమా?
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అనేక మల్లగుల్లాలు పడినా ప్రజలు మాత్రం బీజేపీకి అవకాశం నిరాక రించి కాంగ్రెస్‌ను ఎన్నుకోలేదా?అలాగే రామమం దిరం వ్యవహారం బీజేపీకి బాగా మేలు చేయొచ్చు గాని మతరాజ్య భావన వచ్చిందనే భావన కూడా రావడంతో ఏదో ఒక మేరకు వ్యతిరేక ఓట్లు కూడా పెరగవా? అంతా అను కూలంగా వుంటే నితీశ్‌ను మళ్లీ ఎందుకు రానిచ్చేవారు? బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు సీట్లు నిరాకరించారు గనక వెంటనే బీజేపీతో పాటు ఆమెనూ ఎక్కువ చేసి చూపుతున్నా రు గానీ ఆమె ఇండియాను బలపర్చినప్పటి మాటేం టి? ఆమె తనే ప్రధాని కావాలనే ఆశతో అడ్డంకులు సృష్టించినప్పుడు వాటిని పెద్దగా చూపించిందీ వీరే కదా? మమత, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ ఎవరూ కలిసి రారని బీజేపీ వ్యతిరేక కూటమి వట్టి మాట అని అన్నవారు ఏదో విధంగా ‘ఇండియా’ ఏర్పడిన తర్వాత నాలుక కరుచుకోక తప్పలేదు. సీపీఐ(ఎం) వరకూ ఇది కేవలం బీజేపీ విధాన మతతత్వంపై కేంద్ర నిరం కుశత్వంపై పోరాడే ఒక వేదిక తప్ప కూటమి కాదని చెబుతూనే వుంది. ఆ మాటకొస్తే ఒక నిర్మాణ రూపం వద్దని కూడా సూచించింది.మల్లికార్జున ఖర్గేను ఛైర్మన్‌ గా ప్రకటించిన రోజునే నితీశ్‌ నిష్క్రమణ ఖాయమై పోయింది. దాంతో ఆయన్ను నియమించకపోవడమే సరైందని అప్పుడే అర్థమైంది.అందుకే ఇండియాలో సభ్యత్వం గల పార్టీలేవీ నితీశ్‌ కోసం విచారించింది లేదు!ఆయన గురించిన అంచనా అది. రేపటి ఎన్ని కల్లో కూడా 45 స్థానాలు గల ఆయన వెళ్లిపోయినా ఆర్జేడీ కాంగ్రెస్‌ వామ పక్షాల బలంతో గట్టిగా సవాలు చేయడం తథ్యమే. పక్కనే వున్న జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సొరేన్‌పై ఈడి దాడులతో అరెస్టు చేయడం ప్రతిపక్షాలను బెదిరించే కుట్రల్లో భాగమే. బీహార్‌లో లాలూ కుటుంబాన్ని, కర్నాటకలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌నూ,ఢిల్లీలో కేజ్రీ వాల్‌నూ ఇంకా ఎందరినో ఈ విధంగానే వేటాడటం లో ఆంతర్యం అదే.వారిలో ఎవరు ఏదైనా తప్పు చేశా రా లేదా అనేది ఇక్కడ కీలకం కాదు, బీజేపీని గట్టిగా వ్యతిరేకించే రాజకీయ శక్తులను వేధించి అడ్డులే కుండా చేసుకోవాలి. ఈ కేసులన్నిటినీ చాలా వివరం గా చిత్రించే బడా మీడియా బీజేపీకి సంబంధించిన వారిపై వచ్చిన ఆరోపణలను మాత్రం నామమాత్రం గా చెబుతుంది. ఎవరో ఎందుకు, అదానీ వార్తలే అమాంతం మారిపోయాయి. ఆయనపై అంతర్జాతీ యంగా అనుమానాస్పద కథనాలు వచ్చినా విచారించింది లేకపోగా ఆదుకోవడానికే మో డీ ఆరాట పడ్డారు. ఆ క్రమంలో ఆయన లా భాలు గతంకంటే మరింత పెరిగాయనేది ఇప్పుడు మీడియా ఇష్టమైన స్టోరీ! కనుక సమాచారం వడపోత, మోడీ మోత ఏ స్థాయిలో వుంది తెలియడానికి ఈ ఉదాహరణ చాలదా?
కథ ఇంకా చాలా వుంది!
తాజాగా ప్రవేశపెట్టిన అనామతు బడ్జెట్‌ ఆర్థికంగా దేశదుస్థితిని కళ్లకుకడుతున్నది. దేశం అంతగా దూసుకుపోతుంటే ఎన్నికల కోసమైనా ఏవైనా తాయిలాలు, పథకాల మోత మోగించేవారు కదా? ఎలాగో ప్రహ సనం ముగించి మళ్లీ గద్దెక్కాలన్న ఆరాటం తప్పితే ప్రజానుకూల పథకాలు ఒకటైనా ప్రకటించ గలిగిందా? ఓట్ల కోసమైనా రాష్ట్రాలకు మేలు చేసిందా? ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ప్రత్యేక హోదా, పోలవరం వంటి వాటిని పట్టించుకుకోక పోగా వైసీపీ, టీడీపీ భుజాలపైకెక్కి తన పబ్బం గడు పుకునే తాపత్రయమే సాగుతున్నది. తెలంగాణ లోనూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపో తుందని బీఆర్‌ఎస్‌తో చెప్పిస్తూ మరోవైపు దాన్నీ బెదిరిస్తున్నది.తనతో వుందంటున్న జనసేనతోనూ దాగుడు మూతలాడుతున్నది. ఈ ప్రాంతీయ పార్టీ లన్నీ కూడా స్థానిక అధికారం కోసమే పాకులాడుతూ కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకుండా కీచులాడుకుం టున్న దుస్థితి. తెలంగాణలో అధికార పార్టీగా, ఏపీలో వైఎస్‌ షర్మిల నాయకత్వంలో కదలిక పెరిగిన పార్టీగా కాంగ్రెస్‌ కూడా బీజేపీపై సైద్ధాంతిక రాజకీయ పోరాటానికి, ఎన్నికల సమరానికి విశాల కలయిక అవసరం పూర్తిగా గుర్తించడం లేదు. ఏపీలో అన్నా చెల్లెళ్ల తగాదా ప్రధానమైతే, తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ యుద్ధం ముఖ్యమైపోయింది. మొన్న మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ అందరినీ కలుపు కుని వుంటే ఫలితాలు మారివుండేవి. తెలంగాణ లోనూ మెజార్టీ పెరిగి మరింత నిలకడ వచ్చేది. ఇలాంటి లోపాలు కాంగ్రెస్‌వైపు ఇతర ప్రాంతీయ పార్టీల వైపు వున్న మాట నిజమే గాని బీజేపీకి తిరుగులేదనడం పాక్షిక సత్యం. బీజేపీయేతర బీజేపీ వ్యతిరేకశక్తుల ఉమ్మడి బలం వారి కంటే ఎక్కువ. ఎన్‌డిఎ కూటమిలో చెప్పుకోదగిన పార్టీ కొత్తగా చేరిన జెడియు మాత్రమే. ఎన్నికల పోరాట ఫలితాన్ని ముందే చెప్పేసి చేతులెత్తేయమనడం దురుద్దేశ పూరితం. కథ ఇంకావుంది. చేయవలసిందీ వుంది.
తెలకపల్లి రవి