అవన్నీ మిస్టర్‌ బచ్చన్‌లో ఉన్నాయ్‌

All of them are in Mr. Bachchanరవితేజ, హరీష్‌ శంకర్‌ హైలీ యాంటిసిపేటెడ్‌ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో హ్యూజ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘ఇదొక ట్రూ ఇన్సిడెంట్‌. 1980 ప్రాంతంలో నార్త్‌ ఇండియాలో జరిగింది. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్‌ చేసినా సరే ఓ ఆఫీసర్‌ ఎక్కడా లొంగలేదు. నాకు ఆ పాయింట్‌ చాలా నచ్చింది. రవితేజకి తగ్గట్టు సినిమా ఉంటుంది. నిజాయితీ ఉన్న వ్యక్తుల జీవితంలో ఫన్‌, రొమాన్స్‌, లవ్‌ అన్నీ ఉంటాయి. ఎవరూ చూడని బ్యాక్‌ డ్రాప్‌లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్‌తో సినిమాని తీర్చిదిద్దాం. మళ్ళీ మళ్ళీ చూసేలా, రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా మ్యూజిక్‌ అంత వన్‌ వీక్‌లో చేశాం. వన్‌ వీక్‌లో నాలుగు చార్ట్‌ బస్టర్‌ ట్యూన్స్‌ ఇవ్వడం మామూలు విషయం కాదు. మిక్కీ మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ కంపోజర్‌ అని నా ఫీలింగ్‌. ఈనెల 14 సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రీమియర్స్‌ ఉంటాయి. 15న సినిమా వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ అవుతుంది’.