– జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో జిల్లా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ముఖ్య మంత్రి చేవెళ్ళ పర్యటన సందర్భంగా సోమవారం కలెక్టర్ శశాంక ఫరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో చేవెళ్ల పట్టణానికి చేరుకుని, హెలిప్యాడ్ నుంచి నేరుగా ఫరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేరు కుంటారని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా 200 యూనిట్ల కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ ప్రారంభించే కార్యక్రమాన్ని పూర్తి చేసు కుని, తిరిగి వెళ్లే వరకూ అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బం దీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసర మైతే సోమవారం రాత్రి వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులకు సూచిం చారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ శశాంక హెలిప్యాడ్, స్టేజ్ ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఆర్డీఓ సాయిరాం, జడ్పీ సీఈవో కృష్ణరెడ్డి, డిప్యూటీ సీఈవో రంగరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.