ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి

– టూరిజం అవుట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజమౌళి
– వనదేవతలకు ప్రత్యేక మొక్కులు
నవతెలంగాణ -తాడ్వాయి: రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్చేయోగం చేస్తున్న ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలని టూరిజం ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి అన్నారు. ఆదివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలను ఇష్టమైన పసుపు కుంకుమ చీర సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి, గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం ఔట్సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేసేవిధంగా వనదేవతలు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో వారిని పర్మినెంట్ చేస్తే మళ్లీ వనదేవతలకు ఏటపోతులను తల్లులకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటానని రాజమౌళి తెలిపారు.