శంకర్‌ అక్రమ అరెస్టును ఖండించిన అఖిలపక్ష నాయకులు

నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
జనం టీవీ యూట్యూబ్‌ ఛానల్‌ రిపోర్టర్‌ శంకర్‌ పై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తీరును అఖిలపక్ష కమిటీ సభ్యులు ఖండించారు. శుక్రవారం పట్టణకేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అక్రమ ఆస్తులపై, గత ఎలక్షన్‌ లో ఎలక్షన్‌ కమిషన్‌ కు సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌ లపై జనం టీవీలో కథనాలు రావడంతో జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గొంగిడి సునీత కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా తన అనుచరులతో తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్వేచను కాపాడాల్సిన పాలకులే, భంగం కలిగించడం సిగ్గుచేటని, ఇకనైనా గొంగడి సునీత ఇలాంటి హేయమైన చర్యలు మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు ఎంఏ . ఇక్బాల్‌, బడుగు జహంగీర్‌, ఎంఏ. ఎజాస్‌,గ్యార నరేష్‌,చెక్క వెంకటేష్‌, దుపటి వెంకటేష్‌ , చింతకింది సోమరిషి,మొరుగాడి చంద్రశేఖర్‌, బందేల సుభాష్‌, మొరుగాడి రమేష్‌, బండ్రు ఆంజనేయులు, జూకంటి పౌల్‌ , నల్ల మాస తులసయ్య, బుగ్గ నవీన్‌, రాజేష్‌ , ఎలుగల శివ, కల్వకుంట్ల లోకేష్‌, సుంకరి విక్రం, బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, గ్యార అశోక్‌, సంగి రాజు, వడ్డేమాన్‌ బాలరాజ్‌, ఎలగందుల రాములు, పిక్క గణేష్‌, బండ శీను, ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు.