
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వచ్చేయడాది సుభిక్షంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు శుక్రవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి స్వయం భూ శ్రీ రాజరాజేశ్వర స్వామీని ఎమ్మెల్సీ మధుసూదన చారి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఎంపీపీలు లకవత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోత్ లక్ష్మి బిల్ నాయక్, కౌన్సిలర్ బోజు రమాదేవి రవీందర్, వాళ్ల నవీన్ సుప్రజా, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, మార్క శ్యాంసుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.