ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

– బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్‌ రింగ్‌ బస్తిలో గల ధర్మేందర్‌ అరుంజా,సురేందర్‌ సింగ్‌, జితేందర్‌ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ”హరే రామ హరే కష్ణ” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా తనను పెద్ద మనసుతో ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జెకె.శేఖర్‌ యాదవ్‌, బీజేపీ డివిజన్‌ అధ్యక్షులు కే.పున్నారెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు ఉప్పల రమేష్‌ గుప్తా, స్థానిక నాయకులు కార్యకర్తలు బస్తి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.