– ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-జవహర్నగర్
అమ్మవారి దయతో జవహర్ నగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు మాజీ మేయర్ మేకల కావ్య తెలిపారు. శనివారం జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ శాంతినగర్లో శ్రీముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలయ వార్షికోత్స వేడుకలకు హాజరయ్యారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు, దీవెనలు ఉండాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ అధ్యక్షుడు నాగభూషణం, కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.