ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
దుర్గ మాత అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని  ప్రగతి నగర్ లో దుర్గ మాత దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రతిఏటా దుర్గామాత ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి  పున్న సారయ్య, భాస్కర్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.