నవతెలంగాణ – వీర్నపల్లి
దొంగతనలపై ప్రజలందరూ అప్రమాత్తంగా ఉండాలని ఎస్ఐ రమేష్ తెలిపారు. వీర్నపల్లి మండల అన్ని గ్రామాల ప్రజలకు పోలీసులు తెలియజేయునది ఏమనగా గత కొద్ది రోజులుగా సరిహద్దు మండలాల్లోని పలు గ్రామాలల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. కావున ఎవరైనా అత్యవసర పనులకు, పంక్షన్లకు వెళ్ళే వారు, ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ గ్రామ విపిఓ కు గాని పోలీస్ స్టేషన్ లో వివరాలు సెల్ నెంబర్లు తెలియజేయగలరు. విలువైన బంగారం , వెండి మరియు డబ్బులు ఇంటిలో పెట్టి వెళ్లరాదు . బ్యాంక్ లో బద్రపరుచుకోగలరు. ఎవరైనా ఇతర రాష్ట్రం లేదా జిల్లాల నుండి బొంతలు లేదా ఏదైనా మెటీరియల్ టి వి యస్ ఎక్సల్ టు వీలర్ వాహనం పై విక్రయించడానికి వస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలి అలాగే 100 నెంబర్ కు కాల్ చేసి గాని లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు ఎస్సై నెంబర్ 8712656376 కి సమాచారం ఇవ్వగలరనీ ఎస్సై రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.