నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, కుల సర్వే సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కోసం ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని తహసిల్దార్ దశరథ, మున్సిపల్ కమిషనర్ మున్వర్ ఆలీ బుధవారం తెలిపారు. మండలంలోని 17 గ్రామపంచాయతీలల్లో, మున్సిపాలిటీలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వేను ఎన్యుమరేటర్లు మొదలు పెట్టారన్నారు. ఇంటింటీ కులసర్వేను మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఏఈవోలు, గ్రామపచాయతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్ళి మొదటి రోజు డోర్లపై స్టిక్కరింగ్ వేశారని తెలిపారు.దీనిలో భాగంగా మండల పరిధిలో 68 బ్లాకులల్లో 06 గురు సూపర్వైజర్లు పర్యవేక్షణలో 59మంది ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహిస్తుంన్నారనివారు పేర్కొన్నారు.