ప్రజలందరూ అవసరంలేని వస్తువులను త్రిబుల్ ఆర్ కు ఇవ్వాలి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రజలందరూ మీకు అవసరం లేనటువంటి ఇంట్లో వాడకుండా ఉంటున్నా వస్తువులను చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, పాత పుస్తకాలు, పాత బొమ్మలు ఉంటే త్రిబుల్ ఆర్ సెంటర్లకు ఇవ్వాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న కోరారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని 2వ ,15వ వార్డులో త్రిబుల్ ఆర్ సెంటర్ కు పాతబస్తులు ఇవ్వాలని అవగాహన సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘ మంత్రి కేటీఆర్ , సిడిఎంఏ హైదరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రతి వార్డులో పాత వస్తువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనిత , కమిషనర్ రాజమల్లయ్య , కౌన్సిలర్ లు బోజు రమాదేవి రవీందర్, కొంకటి నళిని దేవి ,అయిలేని శంకర్ రెడ్డి ,ఎం డి ఆయుబ్ , వార్డ్ ఆఫీసర్స్, వార్డ్ రిసోర్స్ పర్సన్స్ ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.