– జిల్లాలో హాజరుకానున్న 8875 మంది
– అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలి
– కలెక్టర్ ప్రియాంక అల
నవతెలంగాణ-పాల్వంచ
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలక అనుగుణంగా జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రియాంక అల ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 8875 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందుకుగాను జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జూన్ 9న ఉదయం10:30 మధ్యాహ్నం 1:00 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 10 గంటలకు పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లుముసివేస్తారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు పరీక్ష కేంద్రాల్లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు అని తెలిపారు. పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు ఒకరోజు ముందే తమ పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవాలని, అభ్యర్థులు హాల్ టికెట్స్ టీఎస్పీఎస్సీ సైట్ నుంచి డౌన్లోడ్ వేసుకోవచ్చు అని తెలిపారు.