గిరిజన బాలుర కళాశాల హాస్టల్ లో అన్ని సమస్యలే..

All problems in tribal boys college hostel..– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి. సయ్యద్
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణములోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో సమస్యలు అధికంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సమస్యల పైన ఎస్ఎఫ్ఐ బృందం సర్వే చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం పట్టణంలోని గిరిజన బాలుర హాస్టల్లో ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించింది అనేక సమస్యలతో విద్యార్థులు అవసరం పడుతున్నారని ఎస్ఎఫ్ఐ బృందం గుర్తించింది ఈ సందర్భంగా మాట్లాడారు స్నానపు గదులు సరి పోను లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగనీరు పరిసరాలలో నిలువ ఉంటుందన్నారు. దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. మెను ప్రకారంగా భోజనం పెడతలేరని అన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని , బాత్రూంలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. నేను చార్జీలు పెంచాలని, కొత్త ప్రభుత్వం కొత్త మెనూ విడుదల చేయాలన్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. విద్యార్థుల సమస్యల పైన ఎస్ఎఫ్ఐ  అలుపెరుగని పోరాటాలు చేస్తుందని అన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సయ్యద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  సభ్యులు మల్లికార్జున్ , హరిలాల్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.