సర్వమతాలను సమానంగా గౌరవించాలి

నవతెలంగాణ – జుక్కల్
సర్వమతాలను సమానంగా గౌరవించాలని జుక్కల్ ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్  తోట అన్నారు. మండలంలోని నాగల్ గావ్ గ్రామములో  బుధవారం నాడు చర్చి భవనాన్ని ఆయన ప్రారంబించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా గెలిచిన తరువాత గ్రామానికి రావడంతో గ్రామ కాంగ్రేస్ నాయకుడు మాజీ సర్పంచ్ అనీల్ కూమార్ మరియు చర్చి సబ్యులు శాలువాతో ఎమ్మెలేను సన్మానించారు. అనంతరం అన్ని పండుగలు, మతాల వారు కలిసి మెలిసి ఉంటూ గర్వంగా ఉండాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో పెద్దఎడ్గి సర్పంచ్ ఎ.వినోద్ , కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్  రమేష్ దేశాయి,    మహమ్మదాబాద్ సర్పంచ్ లక్షెట్టి సాయులు ,  విండో డైరెక్టర్  విఠల్ పటేల్,   మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్ , విరేషం , బాబు పటేల్ , తదితరులు పాల్గోన్నారు.