నవతెలంగాణ – గోవిందరావుపేట
అక్రమంగా తాటి చెట్లు నరికితే కేసులు తప్పవు ఘనంగా కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కల్లుగీత కార్మికులంతా ఐక్యమత్యంతో ఉండాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ రవీందర్ ఎస్ ఐ కమలాకర్ లు అన్నారు. శనివారం పసర పోలీస్ స్టేషన్ ఆవరణలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో జక్కు రాజు అధ్యక్షతన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ రవీందర్ ఎస్ ఐ కమలాకర్ లు హాజరై క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. కల్లుగీత వృత్తిని ప్రతిబింబించేలా క్యాలెండర్ ఉందని గౌడ కులస్తులు అందరూ ఐకమత్యంతో ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని అన్నారు. గీత కార్మికుల సమస్యలపై వారు స్పందిస్తూ చట్ట వ్యతిరేకంగా ఎవరైనా తాడిచెట్లు నరికినచో వారిపై చట్టరీత్యా చర్యలుతీసుకుంటామని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తులందరికీ వ్యాపార అభివృద్ధి కొరకై బైకులు ఇవ్వాలని ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే తేడా లేకుండా అందరికీ సేఫ్టీ మోకులు ఇవ్వాలని వృత్తి పింఛన్లు 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా4 వేలు ఇవ్వాలని ఏజెన్సీ పేరుతో రద్దయిన సొసైటీలను పునరుద్దించాలని ఇప్పుడు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం లో ఏజెన్సీ కల్లు గీత కార్మికుల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అమలు చేయాలనీ వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొనికల రాఘవులు. బైరివిక్రమ్, వత్సవాయి సారయ్య, కాసగాని స్వామి, గండు రాంబాబు, జక్కు బిక్షపతి, బొమ్మగాని జగదీశ్వర్, పూజరి సారంగంగౌడ్ బుర్ర వెంకన్నగౌడ్ దొనికల దామోదర్, కక్కర్ల మహేష్, మెరుగు సుధాకర్, అన్నపురం ఉపేందర్, దొనికల మల్లికార్జును, 30 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.