విద్యార్థులందరూ శాస్త్రీయ విజ్ఞానం పెంచుకోవాలి

– ఎన్‌ఆర్‌ఎస్‌పి శాస్త్రవేత్త రఘువర్మ
నవతెలంగాణ-యాచారం
శాస్త్రీయ విజ్ఞానంపై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకోవాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ ఎన్‌ఆర్‌ఎస్సీ శాస్త్రవేత్త రఘువర్మ అన్నారు. శనివారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇస్రో’కు అనుబంధంగా పనిచేసే సంస్థల ప్రాధాన్యాన్ని తెలిపారు. జీపీఎస్‌ పనిచేసే విధానం, శాటిలైట్‌ టెక్నాలజీ, ఉపగ్రహల ప్రయోగంలో ఉపయోగించే ఇంధనాలు, ప్రకతి విపత్తులను ఎదుర్కునే క్రమంలో ఉపగ్రహాల ఉపయోగం, ప్రకతి వనరులను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగం వంటి విషయాలను చెప్పారు. విద్యార్థులు నూతన సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎపిజే అబ్దుల్‌ కలాం, విక్రం సారాబారు, కస్తూరి రంగన్‌ వంటి శాస్త్రవేత్తల స్పూర్తితో రాణించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్‌ పద్మశ్రీ, ఉపాధ్యాయులు వెంకట్‌ రెడ్డి, సుధారాణి, శ్రీలత, అరుణ, పద్మలత, మురళీధర్‌, అజరు రాథోడ్‌, బోజయ్య, పరమేశ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.