
నవతెలంగాణ-కంటేశ్వర్ : సావిత్రిబాయి పూలే జీవితాన్ని విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలి అని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ డాక్టర్ స్వామి రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోటగల్లి బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ కి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వామి గారు హాజరై వారు మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 03 న జన్మించి మహిళల జీవితాలలో వెలుగులు నింపిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ తరం విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా స్త్రీలకు విముక్తి కల్పించిన మాతృమూర్తి అని ఆయన కొనియాడారు. తన తొమ్మిదవ ఏటా జ్యోతిబాపూలే గారిని వివాహమాడి , మహిళలు ఎందుకు చదువుకోవద్దు అని మహిళలు కూడా పురుషులతో సమానంగా సమాజంలో పరిగణింపబడలని తన భర్త నుండి చదువు నేర్చుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొని మొదటి మహిళా టీచర్ గా ఎదిగిందని అన్నారు. అదేవిధంగా పేదలకు ఉచిత విద్యను నాగపూర్ లో విద్యాలయాలు స్థాపించారని అన్నారు. సత్యశోధక సమాజం ను ఏర్పాటు చేసి బాల్యవివాహాలను, అంటరానితనన్ని అంతం చేయాడానికి విశేష కృషి చేశారు అని అన్నారు. అదేవిధంగా రెండు వేల మంది అనాథలను దత్తత తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థులంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, సావిత్రి భాయి పూలే మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నుస్రత్ జహన్ , కాలేజి లెక్చరర్ సాయిలు , ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు , రాచకొండ విగ్నేష్, బోడ అనిల్,నగర అధ్యక్ష కార్యదర్శులు విశాల్, పోషమైన మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక, ఎస్ఎఫ్ఐ నాయకులు వేణు, సందీప్, ప్రసాద్, దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.