మెరిసేదంతా బంగారం కాదు

మెరిసేదంతా బంగారం కాదుఇమ్రాన్‌ హష్మీ, మహిమా మక్వానా, మౌని రారు, రాజీవ్‌ ఖం డేల్‌వాల్‌, శ్రియా శరణ్‌, విశాల్‌ వశిష్ఠ, నీరజ్‌ మాధవ్‌, విజరు రాజ్‌, నసీరుద్దీన్‌ షా కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘షోటైమ్‌’. ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పై సుమిత్‌ రారు, షో రన్నర్‌ మిహిర్‌ దేశారు రచించడంతోపాటు రూపొందించారు. దీనికి మిహిర్‌ దేశారు, అర్చిత్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సుమిత్‌ రారు, మిథున్‌ గంగోపాధ్యాయ, లారా చాందిని స్క్రీన్‌ ప్లే అందించగా, జెహాన్‌ హండా , కరణ్‌ శ్రీకాంత్‌ శర్మ సంభాషణలు రాశారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. డబ్బు, వ్యాపారం, గ్లామర్‌, సంబంధాలు, జీవనశైలి, బాలీవుడ్‌లో అత్యంత రహస్యంగా ఉంచబడిన అన్ని రహస్యాలను షోటైమ్‌ మార్చి 8న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా చూపించేందుకు సిద్ధమైంది. ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ,”షోటైమ్‌ అనేది పరిశ్రమలోని అనేక విభిన్న ఛాయలను ప్రదర్శించే కార్యక్రమం. షోబిజ్‌, గ్లిట్జ్‌, గ్లామర్‌, డ్రామా ఉన్నప్పటికీ సెట్‌ల వెనుక బయటకు చెప్పని భావోద్వేగ రోలర్‌కోస్టర్‌ను కూడా ఇది తాకుతుంది. ఈ షో ప్రేక్షకులను పరిశ్రమలోని వ్యక్తుల జీవితాలకు దగ్గరగా తీసుకురావడానికి, సినిమా నిర్మాణం వెనుక ఏమి జరుగుతుందో చూపించే ప్రయత్నమిది’ అని అన్నారు. ‘ఇండిస్టీలో ఇన్నేళ్లుగా ఉన్నందున, బాలీవుడ్‌లో తెర వెనుక ఏమి జరుగుతుందో చూపించే షోటైమ్‌ లాంటి కథను చెప్పాలను కుంటున్నాం – మా మసాలా సినిమాల వెనుక ఉండే మసాలాను ఇది మీకు ఇస్తుంది. షోబిజ్‌ ప్రపంచంలోని మెరుపు, గ్లామర్‌, అహం పోరాటాలు, అధికార పోరాటాలను తెలియజేసేదే ఈ షో. బాలీవుడ్‌లో మెరుస్తున్నదంతా బంగారం కాదని మీకు చూపుతుంది. మార్చి 8 నుంచి ఈ షోటైమ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇది తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం’ అని క్రియేటర్‌ సుమిత్‌ రారు తెలిపారు.