నవతెలంగాణ – గోవిందరావుపేట
ఆదివాసీలకు ఐక్యంగా ఉండి చట్టాలను సంరక్షించుకోవాలని పసర పోలీస్ స్టేషన్ సిఐ రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు గొంది కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిరణ్ జెండా ఆవిష్కరించగా సిఐ రవీందర్ ఎస్ ఐ కమలాకర్ హాజరై మాట్లాడారు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలని సిఐ రవీందర్ సూచించారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చింతా కృష్ణ ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడి సాయిబాబు లు మాట్లాడారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో 100% రిజర్వేషన్ ఆదివాసులకు కేటాయించాలి జీవో నెంబర్ 3 వెంటనే ప్రత్యేక చట్టం తేవాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దసరా పంచాయతీ కార్యదర్శి మరియు ఇన్చార్జి ఎంపీ ఓ పూనెం శరత్ బాబు, తుడుం దెబ్బ మండల కార్యదర్శి చింత వెంకటేష్ లతోపాటు పలువురు తుడుం దెబ్బ నాయకులు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.