– పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలి: చీప్ సూపరింటెండెంట్ గంగాధర్
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 28న ప్రారంభమయ్య ఇంటర్ పరీక్షలకు అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్ష నిర్వహణ చీఫ్ సూపర్డెంట్ గంగాధర్ తెలిపారు. మద్నూర్ ప్రభుత్వ కళాశాల చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు ఒక వంద 29 రెండో సంవత్సరం విద్యార్థులు ఒక వంద 67 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉందని ఆయన తెలిపారు. ప్రతిరోజు జరిగే ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు అరగంట ముందుగా హాజరుకావాలని, తొమ్మిది గంటలు దాటి ఒక నిమిషం ఆల్చమైనా పరీక్ష రాయటానికి అర్హత కోల్పోతారని, విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు సమయపాలన పాటించి హాజరుకావాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరీక్షల చీప్ సూపర్డెంట్ కోరారు.