
నవతెలంగాణ – రాయపోల్
పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం మార్చి18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని మీరు సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన సబ్జెక్టులు ఇష్టంతో పరీక్షలలో రాసి అందరు మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.అలాగే పదవ తరగతి మీ బంగారు భవిష్యత్తుకి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు,గ్రామానికి మీరు చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు.