సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి

-హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు రాధ రెడ్డి
 నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
హైదరాబాద్ విద్యాశాఖ సమగ్ర శిక్షా లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు జి రాధరెడ్డి అన్నారు. సోమవారం గన్ ఫౌండ్రీ లోని జిల్లా డిఈఓ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు రాధరెడ్డి మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగులందరి పి విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నారు. అప్పటివరకు కనీస వేతనాల స్కేల్ను అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు. ఆరోగ్య బీమా ఐదు లక్షల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 16వ తేదీ నుండి నిర్వాదిక నిరసనలు తెలుపుతామని అన్నారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, సరిత, ఉపాధ్యక్షులు షేక్ పాషా, మోహన్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.