నవతెలంగాణ – తుర్కపల్లి
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ అర్హులైన పేదలను గుర్తించి ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. గురువారం స్థానిక జే ఏం ఫంక్షన్ హాల్లో జరిగిన తుర్కపల్లి మండల 8వ సీపీఐ(ఎం) మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ,రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం దగ్గరికి వస్తున్న ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీ అమలుజరపడంలో కనీసం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. గత బి ఆర్ ఎస్ హయాంలో అనేకమంది పేదలు రేషన్ కార్డు లేక టిఆర్ఎస్ సర్కార్ ఇచ్చినటువంటి డబల్ బెడ్ రూమ్లు పేదలకు పంచక ఒకే ఇంటిలో ఒకటి రెండు కుటుంబాలు నీవాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడ్డ ప్రస్తుతం అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి కనీసం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అమలు జరిపిన పరిస్థితి లేదని వారు అన్నారు. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం నామినేటెడ్ కమిటీలను ప్రోత్సహిస్తూ గ్రామాలలో అర్హులకు కాకుండా నామినేటెడ్ కమిటీల ద్వారా ఎంపిక చేసే ఆలోచన సరైనది కాదని తెలియజేశారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక జరగాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరు మల్లేశం మాట్లాడుతూ.. తుర్కపల్లి మండల వ్యాప్తంగా అనేకమంది పేద ప్రజలు ఇండ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈ మండల మహాసభలో వీరితోపాటు పార్టీ మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్డి,వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి పీర్లపల్లి ముత్యాలు ,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు లింగయ్య, నరసింహ ,మాతయ్య ,వెంకటేష్, కలమ్మ, నాగులు, దుర్గయ్య, వెంకటేష్, నాగరాజు ,పోచయ్య, కనకయ్య, స్వామి, రాజు,హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.