– శతాధిక వయోధికుని సమున్నత ఆదర్శం
కొలకతా : జీవితకాలంలో తాను పొదుపు చేసుకున్న మొత్తం సొమ్మును ఒక శతాధిక వయోధకుడు మార్క్సిస్టు పార్టీకి అందజేసి సమున్నతమైన ఆదర్శనీయతను చాటారు. ఆయన పేరు కామ్రేడ్ రవీంద్ర కుమార్ నాథ్. వయస్సు అక్షరాలా నూటారెండేళ్లు. ఇంతటి సంపూర్ణవంతమైన జీవిత చరమాంకంలోనూ ఆయన శ్లాఘనీయమైన కృషి చేశారు. జీవిత పర్యంతం తాను దాచుకున్న సొమ్మును సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీకి అందజేసి మార్క్సిస్టు పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్ సలీంకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సృజన్ భట్టాచార్య, తదితర నాయకుల సమక్షంలో రవీంద్ర అందజేశారు. ఇలాంటి ఆదర్శప్రాయమైన ప్రోత్సహకాలు పార్టీని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా సలీం పేర్కొన్నారు. రవీంద్రకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.