రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి..

All the people of the state should be prosperous.– మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.  బుధవారం నూతన సంవత్సరం,  వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి, ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ లో సతి సమేతంగా పూజ కార్యక్రమంలో  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ప్రశాంత్ రెడ్డి దంపతులకు దీవెనలు అందించి, ఇస్కాన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను అందజేశారు.ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.