కేంద్ర ప్రభుత్వం పథకాలను నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని కంజర్, కులాస్పూర్ తాండ గ్రామలలో ఆదివారం రోజున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత సంకల్ప యాత్రలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ 17 రకాల పథకాలను నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన పథకాలు చాలా ముఖ్యమైన అని నిరుపేదలందరూ దారిద్రరేఖకు దిగవనున్నవారు. ముఖ్యంగా తమ ఇంటిని నిర్మించడం కోసం ఆవాస్ యోజన కింద అప్లై చేసుకోవాలని, అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంలో మన తెలంగాణ రాష్ట్రం కూడా చేరిందని, నిరుపేదలందరూ ఇటువంటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని డీపీఓ జయసుధ తెలిపారు. చాలా మట్టుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీటి పైన అవగాహన లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల పైన అవగాహన కొరకు జిల్లాలోని అన్ని గ్రామా పంచాయతీలకు ఈ పథకాల పైన అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని వారు తెలిపారు.
అలాగే వీటి ప్రచారం కొరకు ప్రచార రతాలను కూడా ఏర్పాటు చేశామని రోజువారి విధంగా ప్రతి మండల్లో రెండు గ్రామాలను ఈ కార్యక్రమం చేపడుతున్నామని మొత్తం జిల్లాలో అన్ని పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఆర్డిఓ చందర్ నాయక్, జెడ్పి సీఈవో, ఎంపీడీవో లింగం నాయక్, ఎంపీఓ ఇక్బాల్, ఏపీఎం మోహన్, ఏపీ ఓ సునీత, సర్పంచులు భరత్ మరియు శ్రవణ్, మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు