పట్టపగలే అందరూ చూస్తుండగా దొంగతనం చేయడం ఎలా సాధ్యమవుతుందీ – అని అనుకుంటారు గానీ, నేటి మనువాద ప్రభుత్వం సామాన్యుల్ని కొల్లగొడుతున్నది చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, ఒకప్పటి వైదిక ధర్మ ప్రభోదకులు చేసింది కూడా ఇదే- అందరూ చూస్తుండగానే దేశవ్యాప్తంగా చేస్తూ పోయారు. అందుకు అన్ని ఆధారాలూ దొరికాయి. ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. నేటి కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రామాలయం కట్టించింది. ఇది దేశ ప్రజల కండ్లెదుటే జరిగింది. అయితే, జరిగిన దొంగతనం ప్రజలకు తెలయకుండా జాగ్రత్త పడింది. నేపాల్‌లోని లుంబినిలో ‘బాల బుద్ధుని’-విగ్రహం లభించింది. అది బుద్ధుని జన్మస్థానం! అయితే, అలాంటి బాలబుద్ధుని విగ్రహమే సాకేత్ నగరంలో అంటే అయోధ్యలో కూడా దొరికింది. ఆ విగ్రహాన్ని చూపించి అది ‘బాల రాముడి’ విగ్రహమని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. ఆ బాల రాముడి కోసం పెద్దగుడి కట్టారు. ఆ బాలరాముడి విగ్రహం చుట్టూ పెద్దఎత్తున దేశంలో కుట్రల కుళ్లు రాజకీయాలు నడిచాయి. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆ దేవాలయ నిర్మాణంలోనూ, ఆ దేవాలయానికి వెళ్లే హై-వే: రోడ్డు నిర్మాణం లోనూ నేటి ఆరెస్సెస్ – బీజేపీ ప్రభుత్వపు అవినీతి వికృతంగా బయటపడింది.
ఈ మాటలు ఊరికే అనడం లేదు. అన్నింటికన్నీ చారిత్రక ఆధారాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ (కేదార్ నాథ్ పాండే) పేరూ, ‘ఓల్గా సే గంగా’ పుస్తకం శీర్షిక గురించి వినని వారుండరు. కదా? అందులో ఏ ముందో ఒకసారి చూడండి – మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు బృహద్రతుని చంపి, మగధలో పుష్యమిత్రుడు శృంగరాజ్యాన్ని స్థాపించాడు. శృంగవంశం – సాధారణ శకానికి ముందు 184 దీజజు నుండి సాధారణ శకం 74జ.జు వరకు, దాదాపు 258 సంవత్సరాలు మగధను పాలించింది. సాధారణ శకానికి ముందు 184-147 దీజజు వరకు పాలించిన పుష్య మిత్రుడు భరధ్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు. వైదికమతాన్ని పెంచి పోషించిన ఇతను, ఎన్నో అశ్వ మేధ యాగాలు చేశాడు. పైగా కనిపించిన బౌద్ధ భిక్కువులనందరినీ చంపించాడు. ఈ శృంగవంశపు రాజుల కాలంలోనే రామాయణ రచన జరిగి ఉంటుందని సుప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి, బౌద్ధ వాజ్ఞ్మయ మహాజ్ఞాని రాహుల్ సాంకృత్యాయన్ ‘ఓల్గా సే గంగా’ గ్రంథంలో రాశాడు. (పేజీ:213) శృంగవంశపు రాజుల మన్ననల కోసం వాల్మికి పుష్యమిత్రుణ్ణి లేక అగ్ని మిత్రుణ్ణి రాముడనే పేరుతో కీర్తించాడు.
రాహుల్ సాంకృత్యాయన్ (9 ఏప్రిల్ 1893 – 14 ఏప్రిల్ 1963) అసలు పేరు కేదార్‌నాథ్ పాండే. బ్రాహ్మనిజాన్ని నిరసించి, బౌద్ధుడయినవాడు. 1951లో ఆయన బదరీనాథ్ యాత్ర చేసివచ్చి – అక్కడి బదరీనాథ్ విగ్రహం – ‘ధ్వంసం చేసి బుద్ధుడి విగ్రహమని ప్రకటించాడు. ఈ విషయం ఆయన తన ‘హిమాలయాల పరిచయం” (హియాలయా పరిచరు: హిందీ) అనే గ్రంథంలో 11వ అధ్యాయంలో నమోదు చేశాడు. విగ్రహం చేతులు విరగొట్టి, ముఖ కవళికలు చిధ్రంచేసి, రూపురేఖలు మార్చారని స్పష్టంగా రాశారు. క్షేత్ర స్థాయిలో అక్కడి స్థానికులు చెప్పే విషయమేమంటే – బదరీనాథుడి శిల్పం ముందు టిబెట్ లామాల దగ్గర ఉండేదనీ – అక్కడి నుండి తెచ్చి ఇక్కడ పెట్టారనీ చెపుతారు. ఇక శివుడికీ పార్వతికీ సంబంధించిన కట్టుకథలు మనువాదులు ఆ ప్రాంతంలో బాగా ప్రచారం చేశారని చెపుతారు. పార్వతి శాపం వల్ల అక్కడ పంటలు పండటం లేదనీ, మంచుకురుస్తూ ఉంటుందని కథలు చెప్పుకుంటారు. ఏ కథలు చెప్పినా, శివుడి విగ్రహం కానే కాదు. అది రూపు మార్చిన బుద్ధవిగ్రహం!
మధ్యప్రదేశ్ పన్నాలోని చముక్‌నాథ్ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని శివలింగంగా పూజిస్తున్నారు. ఆ ఆలయం బౌద్ధ విహార్ అనీ, ఆ విగ్రహం బుద్ధుడిదనీ, అక్కడ బౌద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే కుట్ర జరిగిందని ప్రముఖ బౌద్ధ బిక్కు శ్రీజితా గౌతమ్ స్వయంగా అక్కడికి వచ్చే ప్రజలకు, మీడియాకు చెపుతున్నారు,. చముక్‌నాథ్ ఆలయం, పన్నా, మధ్యప్రదేశ్‌లో – గర్భ గుడిలో చతుర్ముఖ శివలింగం పేరిట ఒక విగ్రహం ఉంది. కానీ, ఆ విగ్రహం తధాగత్ బుద్ధుని చతుర్ముఖ విగ్రహం (స్క్వాడ్) సుమారు ఐదుగురు ఎత్తుంటుంది. ఇలాంటి కుట్రే ద్వారకలో కూడా చేశారు. తధాగత్ బుద్ధుణ్ణి ద్వారకాధీశునిగా ప్రకటించారు. అంతా బ్రాహ్మణ పండితుల దుష్ప్రచారం మాత్రమే! ద్వారకలో ఉన్నవి ప్రాచీన భారీ దేవాలయాలు కావు. అవన్నీ ప్రాచీన బౌద్ధవిహారాలు కావాలంటే మధుర మ్యూజియం వెళ్లిచూడండి. మధుర – శ్రీకృష్ణుడి స్వస్థలం అని ప్రచారం చేశారు కదా? మధుర మ్యూజియంలో ఒక్కటంటే ఒక్కటి శ్రీకృష్ణుడి ఆనవాలు, విగ్రహం ఎందుకు లేవూ? అన్నింటికన్న బుద్ధ విగ్రహాలు, బౌద్ధశిల్పాలు ఎందుకున్నాయీ? హిందూ దేవాల యాల్లోని విగ్రహాలకున్న మేకప్‌లు, ఆభరణాలు, పూసిన రంగులు తొలగించి చూడండి. అన్నిచోట్లా బుద్ధుడి విగ్రహాలు, బౌద్ధశిల్పాలు కనిపిస్తాయి.
చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోనివారికి, తర్వాతి కాలంలో చరిత్రే గుణపాఠం నేర్పుతుంది.చక్రవర్తి అశోకుడి కాలంలో నేటి ఒరిస్సా ప్రాంతాన్ని ‘కళింగ’ అని పిలిచేవారు. అశో కుడు ఇక్కడ విజయం సాధించిన తర్వాత, ఈ ప్రాంతమంతా బౌద్ధ క్షేత్రమయ్యింది. ఇక్కడ అశోకుడికీ, బౌద్ధానికీ సంబంధించిన ఎన్నో చిహ్నాలు ఉన్నాయి. అనేక బౌద్ధ విహారాలున్నాయి. కానీ మనవాదులు ఆబౌద్ధ అవశేషాలను, చిహ్నాలను బ్రాహ్మణీకరించారు. వాటిద్వారా తమ ఉపాధిని చూసుకున్నారు. ఒరిస్సాలో ఒక పురాతన ఆరామాన్ని ఆలయంగా మార్చుకుని, అందులోని విగ్రహం ‘పద్మావతి’ది అని ప్రకటించారు. విగ్రహంపై చీర కప్పి, పూలతో అలంకరిస్తే వాస్త వం మరుగునపడుతుంది కదా? అది ఊహాజనితమైన దేవతా విగ్రహం కాదు. విగ్రహం జాగ్రత్తగా పరిశీలించిన వారికీ, కొద్దిపాటి వివేకం ఉపయోగించిన వారికి, బుద్ధుడి శిల్పాలతో పరిచయం ఉన్నవారికి- విషయం సులభంగా అర్థమవుతుంది. బుద్ధుడి విగ్రహాన్ని మార్చి, పద్మావతిగా పూజలు చేస్తున్నారని – ఒకప్పటి ఆరామాన్ని మార్చి, వైదిక- హిందూ దేవాలయంగా మార్చు కున్నారని!! భారతదేశంలోని విగ్రహాల వాస్తవికతను లేదా అసలు రూపాన్ని బయటకు తీయా లంటే, ఆ విగ్రహాలపై ఉన్న అలంకరణలు తొలగించాలి! కృత్రిమంగా చేయించి పెట్టిన తొడుగులు తీసెయ్యాలి!! ఇలాంటి మార్పిడులను దక్షిణ ఆసియా సోక్రటీస్‌గా పేరుగాంచిన పెరియార్ తీవ్రంగా నిరసించిన విషయం గుర్తుంచుకోవాలి.
బుద్ధుడు మౌనముద్రలో ఉండగా, వెనక నుండి పడగవిప్పిన నాగు అతనికి రక్షణగా ఉంటుంది. ఇక్కడ నాగుపాము నాగజాతికి సంకేతం. భారతదేశంలో ఒకప్పుడు నాగజాతి వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వారంతా బుద్ధుని అనుచరులు. వారు బుద్ధునికి అనుచరులుగా ఉన్నారని చెప్పడానికి బౌద్ధంలోని వజ్రయాన శాఖవారు అలా శిల్పాలు చెక్కుకున్నారు. నాగజాతి వారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ దేశంలో ఇప్పటికీ నాగ – పేరుతోనే వ్యవహరింప బడుతున్నాయి. ఉదాహరణకు నాగ్‌పూర్, అనంత్‌నాగ్ వంటివి చూడొచ్చు. ఒకప్పుడు బౌద్ధులకు నాగపూర్ నిలయంగా ఉంది కాబట్టే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాగ్‌పూర్‌లో బౌద్ధం స్వీకరించారు (14 అక్టోబర్ 1956) దాన్నే ఇప్పుడు ‘దీక్షాభూమి’ అంటున్నాం! ఒకప్పుడు మన భారతదేశంలోని మూలవాసులందరూ బౌద్ధులే! ఆర్యుల రాకతో వారంతా హిందువులుగా ముద్రవేయబడ్డారు. మొఘలుల రాకతో హిందువుల్లో కొందరు ముస్లింలుగా మారారు. బ్రిటీష్ వారి రాకతో మరికొంత మంది క్రైస్తవులుగా మారారు. నిజానికి ఈ దేశంలో ముస్లిం, క్రైస్తవ మూలాలు లేవు. అందరూ ఈ దేశ మూలవాసులే! వేల ఏండ్ల చరిత్ర – అందులోని వాస్తవాలు తెలుసుకుని, తమ మూలాలేవో అర్థం చేసుకున్నవారంతా ఇప్పుడు మళ్లీ బౌద్ధులుగా మారుతున్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడంతో ఈ దేశవాసులకు ఒక ప్రేరణ లభించింది. ఒక జీవన మార్గం కనిపించింది.
బౌద్ధదేవత ‘సురసతి’ నుండి బ్రాహ్మణార్థులు సరస్వతికి రూపకల్పన చేసుకున్నారు. ‘ప్రపంచ పాలిబాషా దినోత్సవం- ఎప్రిల్ ఒకటి! భారతీయులకు వారి అసలు చరిత్ర తెలియకుండా ఉండడానికి ఎప్రిల్ ఒకటిని ‘పూల్స్ డే’ గా మార్చి ప్రచారం చేశారు. పాలిభాషలోని ఖత్తియ నుంచి ఏర్పడిందే క్షత్రియ. ఖత్తియా అంటే స్థానిక పాలకుడు అని అర్థం! బుద్ధిజం నుండి తీసుకున్నదే ఖత్తియా పదం. ఉత్తర భారత దేశంలో ఖత్తియా, ఖత్రి పదాలు ఇప్పటికీ కొందరి పేర్ల చివర కనిపిస్తాయి. బ్రాహ్మణ పురోహితులు ‘మంగళాష్టకం’- అని అంటున్నారు. ఎనిమిది మాత్రమే ఎందుకూ? ఏడో, తొమ్మిదో, ఎందుకు కాదూ? అంటే, ఎనిమిది తథాగత బుద్ధుని ‘అష్టాంగ మార్గాని’కి సంబంధించిన పాలి భాషా పదం. బుద్ధుణ్ణీ, బౌద్ధాన్నీ మరిచిపోయినా, ప్రజలు ఇప్పటికీ కొన్ని పాలి భాషా, పదాలు వాడుతున్నారు. బౌద్ధ విధానాలు ఆచరిస్తున్నారు. ‘మంగల సుత్త’ (మంగళ సూత్రం)లో 38 పూసలు మాత్రమే ఉంటాయి. దాని ద్వారా బుద్ధుడు చెప్పిన 38 మంగళసూత్రాలను ప్రజలు గుర్త్తుంచుకుంటారని ఆ ఏర్పాటు జరిగింది. మనమంతా మూల వాసులుగా ఉన్నప్పటి సంగతి అది! మంగళ సూత్రానికి మధ్యలో 3 బిళ్లలుంటాయి. అవి ధర్మంలోని త్రిశరణాలు. వాటి మధ్య 8 గుండ్లు ఉంటాయి. అవి అష్టాంగ మార్గానికి సంబంధిం చినవి. ఇటూ అటూ ఉండే దారానికి 38 పూసలు ఉంటాయి. బ్రాహ్మణార్యుల ప్రభావంతో ఇవన్నీ మారి పోతూ వచ్చాయి. పూసల సంఖ్య పెంచుతూ వచ్చారు. బౌద్ధ నేపథ్యాన్ని మరుగున పడేశారు. విదేశీ యురేషియన్‌లు వారి ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చినప్పుడు కొన్ని కొన్ని మార్పులు జరు గుతూ వచ్చాయి. ఎంత చేసినా వారి కుట్రలు బట్టబయలవుతూనే ఉన్నాయి. మంగళసూత్రానికి సంబంధించిన ఈ వివరాలన్నీ అంతర్జాతీయ బౌద్ధా నెట్‌వర్క్‌లో ఎ.కె.దివేకర్ నమోదు చేసినవి.
– డాక్టర్ దేవరాజు మహారాజు