వీధులన్నీ బురదమయం.. పడకేసిన పారిశుధ్యం

The streets are all muddy.. broken sanitationనవతెలంగాణ – గోవిందరావుపేట
ఇటీవల కురిసిన వర్షాలకు పసర గ్రామంలోని వీధులన్నీ బురదమయం అయ్యాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో బృందం గ్రామంలోని వీధులను పరిశీలించింది. ఈ సందర్భంగా కార్యదర్శి ఆగిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని 8వ వార్డులో గల రోడ్డు చినుకు పడితే చిత్తడే. హై స్కూల్ పక్క బజారు బురదమయంగా మారడం వలన స్కూలుకు వెళ్లే విద్యార్థులు మరియు హాస్పిటల్ కి వచ్చే ప్రజలు ఈ రోడ్డు వెంబడి నడవాలంటే భయపడుతున్నారు కనుక గ్రామపంచాయతీ అధికారులు మరియు మండల అధికారులు స్పందించి ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు కట్టించి ప్రజల అవసరాలు తీర్చాలని సీపీఐ(ఎం) పార్టీ బృందం డిమాండ్ చేస్తుందన్నారు. వీధులలో వర్షపు నీరు ఇంకా నిలువ ఉండడం వల్ల పారిశుధ్యం లోపించి దుర్గంధం వేస్తోందని దోమలు చేరి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే రహదారులను బాగు చేయడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఒకవేళ చేయని యెడల ప్రజలను ఏకం చేసి గ్రామపంచాయతీ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం సిపిఎస్ స్కూల్ సందర్శించి మధ్యాహ్నం భోజనం మరియు పాఠశాల స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు. మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి. గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు పార్టీ నాయకులు సోమ మల్లారెడ్డి పల్లపురాజు కందుల రాజేశ్వరి మంచాల కవిత బుర్ర శ్రీనివాస్ ఉపేంద్ర చారి అశోక్ కిట్టు అచ్చమ్మ కైక మురళి. అరుణ్ జీవన్ అరవిందు తదితరులు పాల్గొన్నారు.